జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా-Jamurathiri Jabilamma Lyrics in Telugu PDF
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలాజోరు గాలిలో జాజికోమ్మ జారనీయకే కల
వయ్యారి వాలు కళ్ళలోన
వరాల విండి పూల వాన
స్వరాల ఊయలూగువేళ
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అని స్నేహం పిలవగా
కిలకిల సమీపించే సడులతో
ప్రతి పోద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్ట బోమ్మ గుబులుగుందని
వనము లేచి వద్దకోచ్చి నిద్ర పుచ్చని
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
మనసులో భయాలన్ని మరిచిపో
మగతలో మరో లోకం తేరుచుకో
కలలతో ఉషా తీరం వెతుకుతూ
నిదరతో నిషారానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికోమ్మ జారనీయకే కల
వయ్యారి వాలు కళ్ళలోన
మ్మ్..మ్మ్..హాహ
స్వరాల ఊయలూగువేళ
హాహ హాహ హా తాన నాన మ్మ్ మ్మ్ హహా
తాన తనననా తాని నాన మ్మ్ మ్మ్ హహా..
జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా-Jamurathiri Jabilamma Lyrics in Telugu PDF
Download PDF file from here (link will be updated soon)
No comments:
Post a Comment